అభివృద్ధి చెందుతున్న సమాజంలో విద్యార్థులకు అవసరమైన జ్ఞానాన్ని అందిస్తూ వారిని సన్మార్గంలో నడిపించే వలసిన బాధ్యత ఉపాధ్యాయుల పైనే ఎక్కువగా ఉన్నదని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు
స్పందన, ఈద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం లో భాగంగా స్థానిక కాకాని రోడ్డు ఏ ఎస్ కన్వెన్షన్ హాల్ నందు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల నుండి 200 మంది పైగా గుర్తించిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.
విద్యార్థినులలో ఆత్మస్థైర్యం నింపే విధంగా పౌండేషన్ రూపొందించిన లోగోను ఆవిష్కరించిన అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ ఉమ్మడి కుటుంబాలు అంతరించి న నేపథ్యంలో విద్యార్థులకు తల్లిదండ్రుల కంటే ఉపాధ్యాయులు తోనే ఎక్కువ కాలము గడుపుతారని వారికి కావలసిన చదువు, జీవన నైపుణ్యాలు నేర్పాల్సిన బాధ్యత వారిపై నే ఎక్కువగా ఉన్నదని చెప్పారు. గత రెండు సంవత్సరాలుగా మేధావులు, సైకాలజిస్టుల తో స్పందన ఈ ద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ రెండు రాష్ట్రాలలో విద్యార్థులను జాగృతం చేయడంతోపాటు ఆత్మహత్యల నివారణ లో కీలక పాత్ర పోషించటం అభినందనీయమని తెలియజేశారు.
“టీచర్స్ రిలేషన్ షిప్ ఇన్ ఎడ్యుకేట్టిoగ్ ఫర్ నేషన్ డెవలప్మెంట్” అంశం పై రోజంతా నిర్వహించిన అవగాహన సదస్సు లో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జూమ్ యాప్ ద్వారా సందేశం ఇచ్చారు. అనంతరం ఉపాధ్యాయులు, సైకాలజిస్టుల నుద్దేశించి ఐఏఎస్ అధికారి డాక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు, సైకాలజిస్టులు డాక్టర్ టి డి విమల, సుధీర్ సండ్ర, టి. ఉషాగిరి, దేవిరెడ్డి కళ్యాణి ప్రసంగించారు
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ డైరెక్టర్ ఈదా అంజిరెడ్డి జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ మూర్తి, ఉపాధ్యక్షులు B. కృష్ణ భరత్, ప్రధాన కార్యదర్శి షేక్ మీరా వలి, రాష్ట్ర కార్యదర్శి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు